ENGLISH | TELUGU  
Home  » TV News

పిల్లలతో కార్తీక్ ఆటలు... జైల్లో మోనిత కలవరపాటు!

on Sep 23, 2021

కార్తీక్‌ను తనను మర్చిపోయేలా దీప మాయ చేస్తుందేమోనని జైలుకు వెళ్లిన మోనిత కలవరపాటుకు గురి అవుతుంటే... ఇంట్లో హాయిగా కార్తీక్ పిల్లలతో ఆటలు ఆడుకుంటూ ఉన్నాడు. అతడిని చూసి తల్లితండ్రులు సంతోషిస్తున్నారు. కార్తీక్ భార్య దీప మాత్రం మోనిత తమ జోలికి రాకుండా ఉంటే చాలని భగవంతుడిని ప్రార్థిస్తూ ఉంటుంది. ఉత్కంఠభరిత సన్నివేశాలు లేనప్పటికీ తర్వాత ఏం జరుగుతుందో? అని ఆసక్తి రేకెత్తించేలా 'కార్తీక దీపం' సీరియల్ సాగుతోంది. ఈ రోజు ఎపిసోడ్ (సెప్టెంబర్ 23, 1152)లో ఏం జరిగిందనే వివరాల్లోకి వెళితే... 

జైల్లో తన గది గోడల మీద 'నా కార్తీక్... నా కార్తీక్' అని రాసుకుని మోనిత మురిసిపోతూ ఉంటుంది. మరోపక్క కార్తీక్‌ను కలవనివ్వకుండా దీప మాయ చేస్తుందేమోనని కలపడుతుంటుంది. "అసలే దీప! మామూలు ఆడది కాదు. నన్ను మర్చిపోయేలా చేస్తుందా? 18 నెలలు నాకు తక్కువే. కానీ, కార్తీక్ ఫ్యామిలీకి ఎక్కువ టైమ్ కదా! అప్పుడు ఎలా? వాళ్లకు టైమ్  ఇస్తే ఏదైనా చేస్తారు. నేను అంత టైమ్ ఇవ్వనుగా. ఇస్తే మోనితను ఎలా అవుతాను?" అని చిటికెలు వేస్తూ ఆవేశంతో ఊగుతుంది. అక్కడితో ఆగలేదు. 

దీపను గుర్తు చేసుకుంటూ, తన కళ్ల ముందు దీప లేకపోయినా వార్నింగ్ ఇస్తుంది. "దీపక్కా! మోనిత జైలుకు వెళ్ళింది. డాక్టర్ బాబును బుట్టలో వేసుకుందామనుకుంటున్నావా? మీ ఇద్దర్నీ కలవనిచ్చేది లేదు. మోనిత ఇక్కడ. కొంగు నోట్లో పెట్టుకుని కన్నీళ్లు పెట్టుకుంటానని కలలు కంటున్నావా? అలాగని అనుకున్నావా? నేను ఏడిపించే టైప్ కానీ ఏడ్చే టైప్ కాదమ్మా!. ఇక్కడ (జైల్లో) కూర్చుని అక్కడ (ఇంట్లో) ఉన్న నీకు చుక్కలు చూపిస్తా. నీ మీద ఒట్టు దీపక్కా. ప్రామిస్" అని మోనిత తనలో అపరిచితురాల్ని చూపిస్తుంది. కాసేపు ఏడుస్తూ, కాసేపు సైకోలా నవ్వుతూ, కాసేపు కోపంగా చూస్తూ వింతగా ప్రవర్తించింది. 

మరోవైపు ఇంట్లో పిల్లలతో కార్తీక్ ఆడుకుంటూ ఉంటాడు. అది చూసి ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉంటుంది. ఆ తర్వాత పిల్లల స్కూల్ ఫీజ్ కట్టడానికి పిల్లలతో పాటు దీపను తీసుకుని బయలు దేరతాడు. అమెరికా వెళదామని అన్న కార్తీక్ ఫీజ్ కట్టడానికి బయలుదేరడంతో దీపకు ఏమీ అర్థం కాదు. ఎలాగైనా అమెరికా ప్రయాణం క్యాన్సిల్ కావాలని కోరుకుంటుంది. మరోవైపు మోనిత తమ జోలికి రాకుండా ఉంటే చాలని, అంతకు మించి ఏమీ వద్దని భగవంతుడిని ప్రార్థిస్తుంది.

కట్ చేస్తే... జైల్లో సుకన్య అనే ఖైదీకి కడుపులో నొప్పి వస్తుంది. డాక్టర్లు ఎవరూ అందుబాటులో లేకపోవడంతో జైలుకు ఖైదీగా వచ్చిన డాక్టర్ మోనితను ఓ పోలీస్ పిలుస్తారు. తర్వాత ఏం జరిగింది?స్కూల్ దగ్గర పిల్లల్ని, షాపింగ్ దగ్గర దీపను వదిలేసి కార్తీక్ ఏ పని మీద బయటకు వెళ్ళాడు? అనేది  రాబోయే ఎపిసోడ్స్ లో చూడాలి.


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.